
SOURCE:-
Keerthy Suresh Compares Bollywood And South Cinema Work Culture, As Posted on Website Times Of India
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, తన పాత్రలకు పూర్తి న్యాయం చేసే నటిగా ఆమె ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా మహానటి చిత్రంతో అద్భుతమైన నటనను కనబరిచి జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు, హిందీ చిత్ర పరిశ్రమకు మధ్య ఉన్న పని విధానాల్లోని తేడాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. తాజాగా తన సినిమా ప్రమోషన్లలో భాగంగా సహ నటి రాధికా ఆప్టేతో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ ఈ విషయాలను పంచుకుంది.
ముఖ్యంగా బాలీవుడ్లో సినిమా ప్రారంభానికి ముందే ప్రి-ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారని ఆమె తెలిపింది..స్క్రిప్ట్ రీడింగ్స్, పాత్రలపై అవగాహన, నటీనటులకు ముందస్తు శిక్షణ, ఇతర ఆర్టిస్టులతో సమన్వయం వంటి అంశాలకు అక్కడ ఎంతో ప్రాధాన్యత ఉంటుందని వివరించింది. అదే దక్షిణాది చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే షూటింగ్ సమయంలో ఎక్కువగా సహజత్వానికి, స్పాంటేనిటీకి ప్రాధాన్యత ఉంటుందని కీర్తి పేర్కొంది..ప్రత్యేకమైన పాత్రలు చేసినప్పుడు మాత్రమే ఎక్కువగా ప్రిపరేషన్ అవసరమవుతుందని, సాధారణంగా షూటింగ్‌కు ముందు పెద్దగా కసరత్తు ఉండదని చెప్పింది. కొన్ని సందర్భాల్లో సహ నటీనటులను సైతం షూటింగ్ రోజే తొలిసారిగా సెట్స్‌లో కలుస్తుంటామని వెల్లడించింది. అయితే బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల్లోని ఈ రెండు విభిన్నమైన పని విధానాలు తనకు నచ్చుతాయని కీర్తి స్పష్టం చేసింది.
ఒక్కో పరిశ్రమలో ఒక్కో విధమైన అనుభవం ఉంటుందని, వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని తెలిపింది. మొత్తానికి కీర్తి సురేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. కీర్తి సురేశ్ నటిస్తున్న తాజా తెలుగు చిత్రాల్లో ‘జనవరి 12 విడుదల’ ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో కీర్తి లతారెడ్డి అనే పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి కీర్తి సురేశ్ ఓ సినిమాలో నటిస్తోంది. ‘రౌడీ జనార్దన’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది..!!
ALSO READ — Keerthy Suresh reveals her Uncomfortable Flight Incident
