
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు కాంబోలో మూవీ తెరకెక్కనుంది. ఈ హారర్ సినిమాకు ‘స్కేరీ పిక్చర్’గా పేరు పెట్టారు. హీరో రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఢిల్లీలో జరిగిన హారర్కాన్ ఇండియా 2026 వేదికగా టైటిల్‌ను రానా ప్రకటించారు. ఈ మూవీతో రవిబాబు తొలిసారి హిందీ పరిశ్రమలో అడుగుపెట్టనున్నారు. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ప్రకటన వీడియోను షేర్ చేసి సినిమాలో తన భాగస్వామ్యాన్ని ధ్రువీకరించారు. ఇది హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కే ద్విభాషా చిత్రమని సమాచారం. కంగనా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. 2009లో వచ్చిన ‘రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్’ తర్వాత ఆమె మళ్లీ హారర్ జానర్‌కు రావడం ఇదే..!!

