in

Janhvi Kapoor breaks silence on her Controversial over-sexualized scenes in Peddi!

Janhvi Kapoor breaks silence on her Controversial over-sexualized scenes in Peddi!

రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘పెద్ది’ చిత్రం వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో కథ పరిధి, యావరేజ్ టాక్ పక్కన పెడితే.. కథానాయకి జాన్వీ కపూర్ పాత్రను చిత్రీకరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం గ్లామర్, అభ్యంతరకర కెమెరా యాంగిల్స్ కోసమే ఆమెను ఉపయోగించారనే వాదనపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న జాన్వీ, ఎట్టకేలకు ‘కాఫీ విత్ కరణ్’ టాక్‌షోలో నోరు విప్పడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌తో పాటు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదలైన సమయంలో ఈ వివాదంపై మిగతా సెలబ్రిటీలు స్పందించినా జాన్వీ మాత్రం సైలెంట్‌గా ఉంది. అయితే తాజాగా కరణ్ జోహార్ షోలో పాల్గొన్న ఆమె..

పెద్ది చిత్రంలో తన పాత్రపై ఓపెన్ అవుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమాలో నా పాత్రను మితిమీరిన లైంగిక కోణంలో చూపించడం, అది మహిళలపై చూపే ప్రతికూల ప్రభావం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ వివాదంలో జరిగిన దానికి సగం బాధ్యత నాదే. షూటింగ్ సమయంలోనే నేను మరింత గట్టిగా ప్రశ్నించి ఉండాల్సింది లేదా నో చెప్పాల్సింది.బైబిల్స్ చూడండి. సాధారణంగా దక్షిణాది సినిమాల్లో కెమెరా యాంగిల్స్, పూర్తి స్థాయి సన్నివేశాల వివరాలు ముందే స్క్రిప్ట్‌లో స్పష్టంగా ఉండవు. పరిశ్రమలో నాకు లభించిన గుర్తింపు, పలుకుబడిని ఉపయోగించి ఆ పరిస్థితిని మార్చాల్సింది. ముందే స్క్రిప్ట్‌ను క్లియర్‌గా తెలుసుకుని ఉండాల్సింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడతాను అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది..!!

how did venkatesh missed Romancing Miss World aishwarya rai

Radhika Apte recalls being asked to do action scene in innerwear!