
ఇటీవల ఓ ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ కోసం ఒంటరిగా వేచి చూస్తున్న సమయంలో కొందరు తన వద్దకు వచ్చారని అనుపమ చెప్పారు. మొదట మాట్లాడేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత తన అనుమతి లేకుండానే ఫొటోలు తీయడం మొదలుపెట్టారని వివరించారు. క్షణాల్లో జనం తనను చుట్టుముట్టారని, ఫొటోలు తీస్తూ తనను తాకారని, ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోలేదని ఆమె పేర్కొన్నారు.
అభిమానులతో ఫొటోలు దిగడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అనుపమ స్పష్టం చేశారు. అయితే, కొందరు ప్రవర్తించే తీరు, హద్దులు మీరడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇలాంటి సమయాల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, ఎక్కడ తాకుతారో తెలియక భయమేస్తుందని ఆమె అన్నారు. నటీనటుల వృత్తి జీవితంలో అభిమానులతో ఫొటోలు దిగడం సాధారణమే అయినా, కచ్చితంగా కొన్ని హద్దులు పాటించాలని సూచించారు. సమాజంలో సాధారణ మహిళలు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలని అనుపమ పేర్కొన్నారు..!!

