
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘ది డర్టీ పిక్చర్’ సినిమాకు 15 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. నిర్మాత ఏక్తా కపూర్ స్వయంగా ‘ది డర్టీ పిక్చర్ 2’ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈసారి ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరు ప్రచారంలోకి వచ్చింది. త్రిప్తి డిమ్రి పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరినీ చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు.. కొత్త సీక్వెల్లో తమన్నా భాటియా నటించే అవకాశముందని అక్టోబర్ 13న కొన్ని సినీ వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి..
త్రిప్తి డిమ్రి కూడా ఈ పాత్ర కోసం పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవి ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారానికే పరిమితం. తమన్నా ఇప్పటికే ఏక్తా కపూర్కు సంబంధించిన ‘రాగిణి 3’ ప్రాజెక్టుతో అనుసంధానమై ఉండటం ఈ ఊహాగానాలకు మరో కారణంగా కనిపిస్తోంది. అలాగే ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి ప్రాజెక్టుల్లో ఆమె చేసిన పాత్రల నేపథ్యంలో ‘ది డర్టీ పిక్చర్ 2’ కోసం ఆమె పేరు పరిశీలనలో ఉండొచ్చనే చర్చ సాగుతోంది. అయినప్పటికీ రెండు సినిమాల మధ్య క్యాస్టింగ్కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు..!!

