in

Janhvi Kapoor condemns AI-generated, sexualized deepfake videos!

Keerthy Suresh’s Dorothy

AI తో మహిళలను కించపరిచేలా కంటెంట్‌ సృష్టించి, ప్రసారం చేయడం అవమానకర చర్య. ఇలాంటివి పనులు చేయడం బాధాకరం. ఇది లైంగిక దాడి లాంటిదే. సినిమా పరిశ్రమలో ప్రతి నటి ఏదో ఒక రూపంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక మహిళకు, ఆమె శరీరానికి గౌరవం ఇవ్వడమనేది మానవత్వం. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి అర్థం కావడం లేదు. ఒక మహిళ మినీ స్కర్ట్ ధరించిందంటే, ఆ స్కర్ట్‌ వైపు కెమెరా పెట్టడానికి, అసభ్యకరంగా చిత్రీకరించడానికి అనుమతి ఇచ్చినట్లు కాదు అని ఘాటుగానే చెప్పింది జాన్వీ..ఒక మహిళకు ఏది సౌకర్యంగా అనిపిస్తే అలాంటి దుస్తులు ధరిస్తుంది..

గత కొన్ని రోజులుగా నాకు ఎదురైన ఏఐ వీడియోల సమస్య గురించి మాత్రమే నేను చెప్పడం లేదు. నా కెరీర్ మొత్తంలో ఎదుర్కొన్న అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను. మహిళపై ఇబ్బందికర చూపులు, జడ్జ్‌ చేయడం, భద్రత విషయంలో రాజీపడమనడం, హద్దులు నిర్ణయించడం ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పడానికి బాధపడుతున్నాను అని అంది జాన్వీ. ఎప్పటి నుండో మహిళలు చుట్టూ ఉన్న ఇలాంటి భయాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచానికి కూడా విస్తరించాయి. వాస్తవ ప్రపంచంలోనే మహిళల జీవితాలను ప్రభావితం చేస్తున్న వాటినే ఇంకా పరిష్కారం కనుక్కోలేకపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్‌ కంటెంట్‌ రూపంలో మరో భయం వెంటాడుతోంది. దీనికి సమాధానం ‘మీ కూతురిని కాపాడుకోండి’ అని చెప్పడం మాత్రమే కాదు అని కుండ బద్దలుకొట్టింది జాన్వీ కపూర్‌..!!

Comrade Kalyan!