in

Keerthy Suresh receives backlash after playing ‘Dorothy’!

కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డోరతీ’. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్దే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం, మరోవైపు అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో LGBTQ అంశాలను తప్పుగా, అసభ్యకరంగా చిత్రీకరించారంటూ నెటిజన్ల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి..

ముఖ్యంగా ఇద్దరు పురుషుల మధ్య వచ్చే ముద్దు సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇందులో హద్దులు దాటిన అడల్ట్ కంటెంట్ ఉందని ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇలాంటి అంశాలను, అడల్ట్ కంటెంట్‌ను బలవంతంగా సినిమాల్లో చూపడాన్ని తప్పుపడుతూ ఎక్స్ వేదికగా #BoycottDorothy అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి పేరున్న ప్రతిష్టాత్మక దర్శకుడి నుంచి ఇలాంటి కంటెంట్‌ను ఊహించలేదంటూ నెటిజన్లు బహిరంగంగానే తమ నిరసన తెలుపుతున్నారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..!!

crazy beauty Kayadu Lohar’s telugu Career Struggles Continue!

NOBODY CAN STOP WHEN GOD PROPOSES!