
టాలీవుడ్ నటుడు శివాజీ ‘తెల్ల కాగితం’ సినిమా ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన దిగ్గజ చిత్రం ‘పుష్ప’కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘పుష్ప’ చిత్రంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ప్రతి నాయక ఛాయలున్న ‘మంగళం శ్రీను’ పాత్ర మొదట తనకే రావలసి ఉందని శివాజీ తెలిపారు.ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ…”మంగళం శ్రీను పాత్రకు మొదట సుకుమార్ నన్నే అనుకున్నారు.
కానీ ఒక పాత్ర ఎవరికి రాసి ఉంటే చివరికి వాళ్లకే దక్కుతుంది. నాకు రాసి లేని పాత్రను నేనెలా చేయగలను? ఆ పాత్ర సునీల్‌కే రాసి పెట్టి ఉంది, అందుకే ఆయన వద్దకు వెళ్లింది. సునీల్ ఆ పాత్రలో అద్భుతంగా జీవించారు, ఎవరు ఏ పాత్ర చేసినా చివరికి అది వాళ్లకే సరిపోతుంది” అని వ్యాఖ్యానించారు. ‘తెల్ల కాగితం’ విశేషాలను ఆయన పంచుకుంటూ..సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చే సమయంలో తాను విన్న రెండో కథ ఇదేనని, కథ బాగా నచ్చడంతో ఈ చిత్రాన్ని తానే నిర్మించాలని అనుకున్నట్లు తెలిపారు..!!

