in

despite loss Shah Rukh is still India’s richest actor!

హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026 తాజా జాబితాలో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ మరోసారి అత్యంత సంపన్న భారతీయ నటుడిగా నిలిచాడు. అతడి మొత్తం సంపద రూ.10,000 కోట్లుగా హురున్‌ వెల్లడించింది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, నైట్‌ రైడర్స్‌ స్పోర్ట్స్‌ సహా అతడి వ్యాపారాల విలువను ఇందులో పరిగణనలోకి తీసుకుంది. అయితే షారుక్‌ సంపద గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. 2025 హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో అతడి సంపద రూ.12,490 కోట్లుగా ఉంది. అంటే ఏడాదిలో రూ.2,490 కోట్ల మేర తగ్గినట్లు లెక్క.

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో షారుక్‌ సంపద రూ.10,800 కోట్లుగా నమోదైంది. ఇక అమితాబ్‌ రూ.4,000 కోట్ల సంపదతో జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. గతేడాది ఆయన సంపద రూ.1,630 కోట్లుగా ఉండగా.. ఈసారి గణనీయంగా పెరిగింది. అమితాబ్‌ ప్రత్యక్షంగా వ్యాపారాలు నిర్వహించకపోయినా ఫ్యామిలీ ఆఫీస్‌ ద్వారా పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. రియల్‌ ఎస్టేట్‌లోనూ ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి. సల్మాన్‌ ఖాన్‌ తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అతడి సంపద రూ.3,000 కోట్లుగా ఉంది. హృతిక్‌ రోషన్‌ రూ.2,500 కోట్లతో జాబితాలో నిలిచాడు. 2025లో అతడి సంపద రూ.2,160 కోట్లుగా ఉండగా..హెచ్‌ఆర్‌ఎక్స్‌ బ్రాండ్‌ వృద్ధితో ఈసారి పెరిగింది..!!

mahesh babu completes his major shoot part for varanasi!

the paradise!