
రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#RAPO23’. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే ఉత్కంఠకు చిత్రబృందం తెరదించింది. ప్రముఖ నటి సంయుక్తను కథానాయికగా ఎంపిక చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సంయుక్త పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వెలువడటం విశేషం. సంయుక్తకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రాజెక్ట్‌లోకి ఆమెను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు..
రామ్, సంయుక్త జంటగా నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ నూతన కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ఒక వినూత్నమైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతార్‌లో రామ్ ఈ సినిమాలో అలరించనున్నారని, నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి..!!
