in

Kareena Kapoor calls out ‘animal’ and Bollywood’s herd mentality!

ర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన ‘యాన్సిమల్’ చిత్రం బాలీవుడ్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రణ్‌బీర్ కపూర్‌కు భారీ బ్లాక్‌బస్టర్ అందించిన ఈ చిత్రం, ట్రేడ్ వర్గాల్లో ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. అయితే, రణ్‌బీర్ నటనకు ప్రశంసలు దక్కినప్పటికీ, సందీప్ రెడ్డి వంగా మేకింగ్, వైలెంట్‌ కంటెంట్‌పై హిందీ పరిశ్రమలోని ఒక వర్గం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా రణ్‌బీర్ బంధువు, ప్రముఖ నటి కరీనా కపూర్ కూడా ఈ రకం వయొలెన్స్ సినిమాలపై స్పందిస్తూ ‘యానిమల్’ ప్రస్తావన తెచ్చింది..

ఒక హింసాత్మక చిత్రం హిట్ అయితే, పరిశ్రమ అంతా దాన్నే ఫార్ములాగా భావించి “యానిమల్ నడిచింది కాబట్టి అందరం వైలెన్స్ చేద్దాం” అనే మెంటాలిటీతో వెళ్తోందని ఆమె వ్యాఖ్యానించింది. సినిమా సక్సెస్ వెనుక సందీప్ పడిన కష్టాన్ని, ఆయన క్రియేట్ చేసిన యూనిక్ కల్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను గుర్తించకుండా కేవలం విమర్శలకే ప్రాధాన్యమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ‘యానిమల్’ విజయం తర్వాత బాలీవుడ్ డార్క్ క్యారెక్టర్లు, అగ్రెసివ్ కథల వైపు మొగ్గు చూపినప్పటికీ, సందీప్ స్థాయి విజయాన్ని సాధించడంలో అవి ఎంతవరకు సఫలమయ్యాయనే విషయాన్ని చాలామంది మరచిపోతున్నారు..!!

Kamal Haasan, Shankar to resume work on Indian 3?

ashika ranganath changed her approach of selecting scripts!