in

simran and jayaram marriage pic goes viral!

వైరల్ అవుతున్న ఫొటోలలో జయరాం తెల్లటి పంచెలో, సిమ్రాన్ ఎరుపు రంగు పట్టుచీర ధరించి మెడలో పూలమాలలతో కనిపించారు. ఈ వేషధారణ చూసి చాలామంది నెటిజన్లు వారికి నిజంగానే వివాహం జరిగిందని భావించి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, వాస్తవాలను సరిచూసుకోకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం సరికాదని, ఇది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ఇబ్బందుల్లోకి నెడుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి జయరాం, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓ నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి హాజరైన నటీనటులను చిత్ర బృందం సంప్రదాయబద్ధంగా పూలమాలలతో సత్కరించింది. ఆ సమయంలో తీసిన ఫొటోలనే కొందరు వక్రీకరించి, అవి వారి పెళ్లి ఫోటోలంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. విషయం తెలిసిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు..!!

‘Culture Is Not What You Wear!’ Kriti Sanon Breaks Silence on Ad Backlash!

Shriya Saran reunites with Rajinikanth after 19 years!