
తాను హైదరాబాద్‌లోనే పుట్టానని, బై బర్త్ తాను పూర్తిగా తెలుగు అమ్మాయినేనని హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో స్పష్టం చేశారు. స్థానిక అమ్మాయి కావడంతో తెలుగు సంస్కృతి సంప్రదాయాలపై తనకు ప్రత్యేకమైన గౌరవం ఉందని ఆమె తెలిపారు. అయితే ఒక రిపోర్టర్ ఆమెను ఉద్దేశించి భవిష్యత్తులో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ తనకు ఆ విషయం గురించి ఇప్పుడే ఏమీ తెలియదని, బహుశా పెళ్లి చేసుకోవచ్చు అంటూ సరదాగా నవ్వుతూ బదులిచ్చారు..
ఆమె ఇచ్చిన ఈ ఆసక్తికరమైన సమాధానం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది..అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో కీలక విషయాన్ని కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదే తాను ముంబై నుంచి హైదరాబాద్‌కు శాశ్వతంగా షిఫ్ట్ అయ్యానని ఆమె తెలిపారు. ఇక్కడే ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడపాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వివరించారు. తనకు స్థానిక కల్చరల్ సెలబ్రేషన్స్ అంటే ఎంతో ఇష్టమని, ఈసారి ఘనంగా జరిగే బతుకమ్మ వేడుకలలో తాను కూడా ఉత్సాహంగా పాల్గొంటానని తెలిపారు. తెలుగు నేలపై పండగలను జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆమె సంతోషంగా చెప్పారు..!!
