
రామ్ పోతినేని దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా సాగుతోంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కోసం మొదట తమిళ నటుడు SJ సూర్యను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ పాత్రకు ఎస్.జె. సూర్య ఏకంగా రూ.8 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో..టీమ్ వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అదే పాత్ర కోసం బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ను ఫైనల్ చేసినట్టు టాక్.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..రితేష్ దేశ్‌ముఖ్ భార్య జెనీలియా. గతంలో రామ్, జెనీలియా కలిసి ‘రెడీ’ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ఇప్పటికీ మంచి స్నేహంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జెనీలియా రిఫరెన్స్‌తోనే రామ్.. రితేష్ దేశ్‌ముఖ్‌ను ‘RAPO 23’లోకి తీసుకొచ్చాడనే ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ రితేష్ నిజంగానే ఈ సినిమాలో నటిస్తే.. తెలుగు ప్రేక్షకులకు మరోసారి ఆయనను ఓ డిఫరెంట్ రోల్‌లో చూసే అవకాశం దక్కనుంది..!!
