in

aishwarya lekshmi to play negative role in raaka!

కాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘రాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే దీపికా పదుకొనే ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ భారీ తారాగణంలోకి మలయాళ, తమిళ చిత్రాల నటి ఐశ్వర్య లక్ష్మి కూడా చేరనున్నట్లు సమాచారం..

నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుందని, అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర తదుపరి షెడ్యూల్‌లో ఐశ్వర్య లక్ష్మి కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాకతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు..!!

kiara advani trolls her missed tamil opportunity!

fahad fazil, sj suryah are out, Riteish Deshmukh in for rapo23!