
అనుపమ పరమేశ్వరన్ తన గతానికి సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించింది. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండి ‘నార్సిసిస్టిక్ అబ్యూజ్’ (మానసిక వేధింపుల)కు గురయ్యానని, శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాలను పంచుకున్నప్పటికీ, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె గోప్యంగా ఉంచింది. “ప్రేమ పేరుతో నా జీవితంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తి, నన్ను పూర్తిగా తన అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించాడు..
నేను ధరించే దుస్తులు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అంశాలు, చివరికి ఎంచుకునే సినిమాల విషయంలోనూ ఆయనే ఆంక్షలు విధించేవాడు. నటనకు స్వస్తి పలకాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. పరిచయమైన మూడు నెలలకే నిశ్చితార్థం, వివాహం చేసుకోవాలని బలవంతం చేశాడు. అది ప్రేమ కంటే నన్ను నియంత్రించే ప్రయత్నంగా అనిపించడంతో వాయిదా వేస్తూ వచ్చాను” అని వివరించింది. ఆ బంధం కారణంగా తాను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, ఆందోళనకు గురయ్యానని, ఫలితంగా శారీరకంగానూ కుంగిపోయి బరువు తగ్గానని అనుపమ ఆవేదన వ్యక్తం చేసింది..!!

