
రష్మిక హై ఓల్టేజ్ డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ కోసం షూట్ చేస్తున్న టైంలో గాయపడినట్లు తెలుస్తోంది. రష్మికకు హిప్ఏరియాలో గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రణబాలి, మైసా వంటి యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తున్నారు. రెండు చిత్రాల్లోనూ వరుసగా యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్స్ సీక్వెన్స్ కోసం రెడీ అవుతున్నారు రష్మిక. ఈ టైంలో తీవ్ర గాయంతో ఆమెకు హిప్ ప్రాంతంలో టెండన్ పూర్తిగా డిటాచ్ అయినట్లు సమాచారం. గాయం తీవ్రత చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయినట్లు రష్మిక సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రొఫెషనల్ అథ్లెట్స్, తీవ్రమైన శారీరక శిక్షణ పొందేవాళ్లు, స్పోర్ట్స్ పర్సన్స్‌లో ఇలాంటి గాయాలు కనిపిస్తుంటాయని డాక్టర్స్ చెప్పినట్లు వెల్లడించాయి..
ప్రస్తుతం రష్మికకు ఆరు వారాల వాటు కంప్లీట్‌గా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. హిప్ ఏరియాలో టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా తప్పనిసరి అని చెప్పారట. దీంతో పలు మూవీస్ షూటింగ్స్‌కు బ్రేక్ పడనుంది. 6 వారాల పాటు రష్మిక షూటింగ్స్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు 30 బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. గాయం కారణంగా షూటింగ్ షెడ్యూల్‌తో పాటు కమర్షియల్ షూటింగ్స్ కూడా వాయిదా పడనున్నాయి. పూర్తి విశ్రాంతి తీసుకుని, రీహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న తర్వాతే ఆమె తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది..!!
