in

Veteran Telugu actor Pavala Shyamala passes away!

ప్రముఖ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అర్ధరాత్రి దాటాక తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుప‌త్రి మార్చురీలో భద్రపరిచారు..

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన తన సినీ ప్రయాణంలో పావలా శ్యామల 250కి పైగా చిత్రాలలో నటించారు. 1985లో వచ్చిన ‘బాబాయ్ అబ్బాయ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ, కె. విశ్వనాథ్ దర్శకత్వంలోని ‘స్వర్ణకమలం’ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’, ‘అతడు’, ‘గోలీమార్’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో తనదైన సహజ నటనతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు..!!

Dhanush Breaks Silence on Raayan National Award Backlash!

Dhanush Breaks Silence on Raayan National Award Backlash!

f cube ‘Janhvi Kapoor’!