in

kayadu lohar in suriya and jai bhim’s director next!

సూర్య మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘జై భీమ్’ తర్వాత ఆయన మరోసారి దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో జతకట్టారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్లను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమా ముహూర్తపు వేడుకను ఘనంగా నిర్వహించారు. సూర్య, హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్‌లో ఇదే తొలి చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్‌గా కయాదు లోహర్ నటిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కతిర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా పనిచేయనున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన ఒక పవర్‌ఫుల్, గ్రిట్టి డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇటీవలే రజనీకాంత్‌తో ‘వెట్టైయాన్’ సినిమాను తెరకెక్కించిన జ్ఞానవేల్, వెంటనే సూర్యతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు..!!

etv prabhakar daughter Divija Makes Her Heroine Debut!

energetic star Ram Pothineni Turns Director With RAPO23!