in

Pawan Kalyan, director Sujeeth expand OG universe!

వర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దే కాల్ హిమ్ ఓజీ’కి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, ఇది ‘ఓజీ యూనివర్స్’లో భాగంగా ఉండనుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రానున్నట్లు వెల్లడించారు..

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ ‘ఎక్స్’ ఖాతాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది. ఇందులో దర్శకుడు సుజీత్, పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ఫ్రాంచైజీలోని రెండో భాగం గురించి చర్చిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. “తుఫానుకు ముందు ప్రశాంతత ఉంటుంది. గంభీర చెప్పని కథ ఇప్పుడు ఆవిష్కృతం కాబోతోంది” అని నిర్మాణ సంస్థ పేర్కొంది. సుజీత్ ఆలోచనలకు, కథనానికి ముగ్ధుడైన పవన్, తన వైపు నుంచి కావాల్సినదంతా సిద్ధంగా ఉంటుందని హామీ ఇవ్వడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది..!!

Tamannaah’s Remarks on South Cinema Sparks Debate!

Rajinikanth about the controversies surrounding his silence!