
దిశా పటానీకి సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫిట్నెస్ వీడియోలు, ఫ్యాషన్ ఫొటోషూట్లు నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. యువతలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. అయితే, ఈ క్రేజ్తోపాటు ఆమెపై తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్, బాడీషేమింగ్ కామెంట్లు కూడా వస్తుంటాయి. ఆమె వేసుకునే దుస్తులపై, చేసే ఫొటో షూట్లపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు..
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడింది. ‘‘ఒకరిని దూరం నుంచి చూసి జడ్జ్ చేయడం చాలా సులభం. గతంలో నేను ఇతరుల అంచనాలకు తగ్గట్టు ఉండాలని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ తాపత్రయాన్ని వదిలేశాను. నా గురించి ప్రజలు ఏమనుకున్నా పర్లేదు. నా అంతరాత్మకు నచ్చినట్టు, నూటికి నూరుశాతం నిజాయతీగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తాను’’ అని చెప్పుకొచ్చింది. నెగెటివిటీని సానుకూలంగా ఎదుర్కోవడంలో ఆమె చూపించే పరిణతి, మానసిక ధైర్యం నేటి యువతకు స్ఫూర్తినిస్తోంది..!!

