in

Sharwanand to romance young beauty Bhagyashri Borse!

శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఆగస్టు మొదటి వారం నుంచి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, అనంతరం జరగబోయే రెండో షెడ్యూల్ లో హీరో – హీరోయిన్ల పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది.

అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది..!!

telugu actors who did dual roles!

Tamannaah’s Remarks on South Cinema Sparks Debate!