
2017లో ఓ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి ‘మిస్టర్ షో ఆఫ్’ (Mr. Show Off) అంటూ వ్యాఖ్యానించిన సంగతి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ ఈ వివాదంపై తనదైన శైలిలో పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు. ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో తనకు తెలియదని, అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త కావడం వల్ల అలా జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. టీవీ షోలలో యాంకర్లు ఇచ్చే కొన్ని ఆప్షన్లలో తనకు ఏది సరిపోతుందనిపిస్తే దానిని ఎంచుకుని ఉంటారని, తాను మాత్రం ఆ విషయాన్ని పెద్దగా మనసులో పెట్టుకోలేదని యశ్ స్పష్టం చేశారు..
ఎవరి అభిప్రాయాలు వారివని, కానీ ఎవరో ఒకరు చెప్పే అభిప్రాయాన్ని బట్టి తన వ్యక్తిత్వం లేదా క్యారెక్టర్ మారదని తేల్చిచెప్పారు. ఇతరుల దృష్టికోణం తనను నిర్వచించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులను ఉద్దేశించి యశ్ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సహ నటీనటులను, తోటి కళాకారులను గౌరవించని వారు ఎప్పటికీ తన అభిమానులు కారంటూ ఫ్యాన్స్‌కు హితవు పలికారు. కాగా, రష్మిక ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో యశ్ అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే..!!
