
గత కొన్నాళ్లుగా విష్ణుప్రియ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా రూ. 399 వసూలు చేస్తూ యువతను పెడదోవ పట్టించేలా అభ్యంతరకరమైన కంటెంట్, అర్ధనగ్న ఫోటోలు షేర్ చేస్తోందంటూ ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పలు విద్యార్థి సంఘాలు, నెటిజన్లు ఆమె ప్రవర్తనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు తన సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌పై అసభ్యకరమైన వీడియోలు చేస్తూ, తన పరువుకు భంగం కలిగిస్తోందంటూ ‘ప్లే లైక్ ఇంకొగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానల్‌పై విష్ణుప్రియ ఎదురు కేసు పెట్టింది. అలాగే తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులు, క్యారెక్టర్ అసాసినేషన్‌పై మియాపూర్ పోలీసులను సైతం ఆశ్రయించింది..
ఈ సబ్‌స్క్రిప్షన్ వివాదం కాస్త సర్దుమణుగుతోంది అనుకునేలోపే, విష్ణుప్రియ తాజాగా మరో బాంబ్ పేల్చింది. రూ. 399 కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకున్న ఫాలోవర్లతో రెండు రోజుల క్రితం ఆమె ప్రత్యేకంగా ఒక లైవ్ సెషన్‌లో మాట్లాడింది. ఆ సమయంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏమాత్రం మొహమాటం లేకుండా తన ‘బాడీ కౌంట్’ 5 అని వెల్లడించింది. అంటే గతంలో తాను ఐదుగురితో రిలేషన్‌షిప్‌లో ఉండి వారితో రొమాన్స్ చేసినట్లు బహిరంగంగా ఒప్పుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ విష్ణుప్రియ ఇలా ఓపెన్‌గా మాట్లాడటంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..!!
