
ప్రముఖ కథానాయిక సమంత గర్భవతి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్ర విజయోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ వీడియోలలో సమంతకు బేబీ బంప్ కనిపిస్తోందంటూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది..
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొన్నారు. వైట్ టీషర్ట్ ధరించిన సమంత, చిత్ర బృందంతో కలిసి కేక్ కట్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోలలో ఆమె గర్భవతిలా కనిపిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..!!

