
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మంచు మనోజ్ ని ఎంచుకొన్నారు. ఈరోజు మనోజ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నందమూరి కుటుంబానికీ, మోహన్ బాబు కుంటుంబానికీ ముందు నుంచీ మంచి అనుబంధం ఉంది..
మనోజ్ నటించిన ‘ఊ కొడతారా..ఉలిక్కి పడతారా’ చిత్రంలో బాలయ్య ఓ కీలక పాత్ర పోషించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు బాలయ్య కోసం మనోజ్ రంగంలోకి దిగుతున్నాడు. ఈసారి మనోజ్ విలన్ గా కనిపిస్తాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. కానీ చిత్రబృందం మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. మిరాయ్. భైరవం చిత్రాల్లో మనోజ్ విలన్ గా నటించాడు. ఆ రెండు సినిమాలతోనూ మంచి గుర్తింపు వచ్చింది. బాలయ్య లాంటి స్టార్ సినిమాల్లో విలన్ గా ఛాన్స్ దక్కించుకోవడం గొప్ప విషయమే..!!
