
సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోలు, కుటుంబ విషయాలు, వ్యక్తిగత అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమె షేర్ చేసే గ్లామర్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే వాటిపై ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. అయినప్పటికీ విమర్శలకు భయపడకుండా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో అనసూయ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి..
తన ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ, తన లైఫ్‌లో ఒకే ఒక బాయ్‌ఫ్రెండ్ మాత్రమే ఉన్నాడని చెప్పింది. ఆ తర్వాత అతనినే పెళ్లి చేసుకున్నానని సరదాగా తెలిపింది. ఆమె మాటలు అప్పట్లో అభిమానులను ఆకట్టుకున్నాయి. అలాగే పెళ్లి కాకపోయి ఉంటే ఏ హీరోతో డేటింగ్ చేయాలని అనుకునేవారు అని అడిగిన ప్రశ్నకు అనసూయ ఏమాత్రం తడబడకుండా రామ్ చరణ్ పేరు చెప్పింది. చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా ఓపెన్‌గా తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా అనసూయ నిజాయితీకి ఫిదా అవుతున్నారు..!!
