in

rashmika mandanna Conquering the Fear Of Heights!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తనలోని అతిపెద్ద బలహీనతను ధైర్యంగా జయించారు. షూటింగ్ కోసం కొచ్చి వెళ్లిన ఆమె, అక్కడ ప్రకృతి ఒడిలో గడిపిన క్షణాలను, ముఖ్యంగా ఎత్తులను చూసి భయపడే తన ‘ఫోబియా’ను ఎలా అధిగమించారో వివరిస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది..

నటి రష్మిక ప్రస్తుతం ‘మైసా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళలోని కొచ్చి పరిసర ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో ఆమె పలు సాహసాలు చేశారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ..”కొచ్చిలో గడిపిన సమయం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అడవులు, రకరకాల కీటకాలు, జలపాతాలు, ట్రెక్కింగ్‌లు , వర్షంలో పరుగెత్తడం..ఇలా ప్రతిదీ ఒక అద్భుత అనుభవం” అని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఎత్తులంటే తనకు వెన్నులో వణుకు పుట్టేదని, కానీ ఈ షూటింగ్ ద్వారా ఆ భయాన్ని పూర్తిగా పారద్రోలానని రష్మిక వివరించారు..!!

Ranbir Kapoor buys land in Ayodhya ahead of Ramayana release!