
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ వార్తల్లో నిలిచారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’లో శ్రీరాముడిగా నటిస్తున్న ఆయన, తాజాగా అయోధ్య పుణ్యక్షేత్రంలో కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆధ్యాత్మికతతో కూడిన ఈ నిర్ణయం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రణ్బీర్ కపూర్ రూ. 3.31 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై రణ్బీర్ స్పందిస్తూ అత్యంత భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు. “అయోధ్యే నన్ను ఎంచుకుందని నేను నమ్ముతున్నాను..ఆ పిలుపుకే నేను సమాధానం ఇచ్చాను” అని ఆయన పేర్కొన్నారు. కేవలం నటుడిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఆయన రామాయణ గాథతో ఎంతగా మమేకమయ్యారో ఈ కొనుగోలు స్పష్టం చేస్తోంది..!!

