
దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును ప్రముఖ సినీ నటి సమంత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మరోవైపు, వీరి జీవిత ప్రయాణం సంతోషంగా, అన్యోన్యంగా ముందుకు సాగుతోంది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ సమంత-రాజ్ నిడిమోరుల బంధం మరింత బలపడుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి విజయవంతమైన ప్రాజెక్టుల తర్వాత, ఇప్పుడు ఈ జంట ‘మా ఇంటి బంగారం’ సినిమా కోసం జట్టు కట్టారు..
సమంత సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ ద్వారా రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వెన్నెల కిషోర్ అడిగిన ‘మీ ఫ్యామిలీ మ్యాన్’ ఎలా ఉంటారు? అనే ప్రశ్నకు సమాధానంగా..”రాజ్ చాలా గ్రేట్, ఆయనో అద్భుతమైన క్రియేటర్” అంటూ సమంత తన భర్తపై ప్రశంసలు కురిపించడం వారి మధ్య ఉన్న గౌరవాన్ని చాటిచెబుతోంది..!!

