in

Nalgonda man arrested for targeting actress anchor Anasuya!

నసూయ భరద్వాజ్ ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించి ఒక నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనపై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ అనసూయ పోలీసులను ఆశ్రయించారు. సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన చంటి అని గుర్తించి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు..

ఈ కేసు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు నెటిజన్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాను ఇతరులను దూషించడానికి లేదా వేధించడానికి వాడితే ఐటీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వేధింపులను భరించకుండా అనసూయ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం పట్ల సినీ వర్గాలు, నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి..!!

Vijay Deverakonda’s next with nani’s director Shouryuv!

Samyuktha Menon set to sizzle in Peddi special song?