in

Samyuktha Menon set to sizzle in Peddi special song?

మెగా పవర్ స్టార్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. తాజాగా ఈ పాటలో హీరోయిన్ కనిపించనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్, మానస వారణాసి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు సంయుక్త పేరు బలంగా వినిపించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది..

ఇటీవల బాలకృష్ణ అఖండ 2 చిత్రంలోని ‘జాజికాయ’ పాటలో మాస్ స్టెప్స్‌తో సంయుక్త ఆకట్టుకున్న సంగతి తెలిసిందే..అలాంటి సమయంలో ఇప్పుడు చెర్రీతో కలిసి స్టెప్పులు వేయబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. డ్యాన్స్ ఎనర్జీకి సంయుక్త గ్లామర్ కలిస్తే ఈ పాటకు మరింత క్రేజ్ రావడం ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్ మాత్రం అధికారిక కన్ఫర్మేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!

Nalgonda man arrested for targeting actress anchor Anasuya!