in

south’s crazy beauty rukmini vasanth steps into Mollywood!

ప్త సాగరాలు దాటి’, ‘కాంతార 2’తో విజయాలు అందుకున్న ఆవిడ..ఇప్పుడు ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించిన రుక్మిణి, ఇప్పుడు మలయాళంలో అడుగు పెడుతున్నారు. రాకింగ్ స్టార్ యష్ సరసన నటించిన పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’ విడుదల కోసం రుక్మిణీ వసంత్ ఎదురు చూస్తున్నారు. అది కాకుండా ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నటిస్తున్నారు. ఆ రెండిటి తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు.

మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ హీరోగా తెరకెక్కుతున్న ఆయన 51వ సినిమాలో రుక్మిణీ వసంత్ కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రస్తుతానికి ఆ సినిమాకు ‘NP51’ వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో నషీద్ మొహమ్మద్ ఫామీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ సినిమా క్లాప్‌ బోర్డ్‌ పట్టుకున్న ఫోటోనురుక్మిణి వసంత్ షేర్ చేశారు. తన మోలీవుడ్ డెబ్యూను కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనది అని ఆమె చెప్పుకొచ్చారు. ‘కాంతార’తో రుక్మిణీ వసంత్ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కూడా పాన్ ఇండియా సినిమాయే. అయితే..నివిన్ పౌలీ సినిమా మాత్రం రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్ అని చెప్పాలి. ‘టాక్సిక్’ తర్వాత హిందీలోనూ రుక్మిణీ వసంత్ సినిమాలు చేసే అవకాశం ఉందని చెప్పాలి.

venky mama joining forces with ajith for dare devil!