in

Ananya Nagalla faces negativity on instagram subscription!

సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ ద్వారా సెలబ్రిటీలు ఆదాయాన్ని ఆర్జించే తీరు పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను వాడుకుంటూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న బ్యూటీలు చాలామంది ఉన్నారు. ఈ విషయంలోనే రీసెంట్ గా విష్ణు ప్రియా పై చాలా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ..యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల అదే బాట పట్టింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డబ్బులు చెల్లించిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే తమ ప్రత్యేకమైన బోల్డ్ ఫొటోలను, వీడియోలను సదరు ముద్దుగుమ్మలు షేర్ చేస్తూ ఉంటారు.

ఐతే, ‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు ₹390 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను మొదలు పెట్టింది. సాధారణ ఫాలోవర్లకు కనిపించని గ్లామరస్ ఫోటో షూట్స్ ను, బిహైండ్ ది సీన్స్ వీడియోలను ఈ ప్లాన్ ద్వారా చూసే అవకాశం కల్పించింది అనన్య. అన్నట్టు అనన్య ఈ ఫీచర్ ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే సుమారు 600 మందికి పైగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారట. ఐతే, ఈ పని చేసినందుకు నెటిజన్లు ఫైర్ అవుతూ అనన్య పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు..!!

south actress Raashi Khanna becomes busy in bollywood!

Rashmika Mandanna undergoing intensive training for ‘mysaa’!