in

south actress Raashi Khanna becomes busy in bollywood!

క్షిణాదిలో విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తూనే, హిందీలోనూ చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ దర్శకుడు అనీస్ బాజ్మీ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, రాశీ ఖన్నా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్లోని సరదా క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. సహనటి విద్యా బాలన్ తనకు ప్రేమగా ఓ బాక్స్ డోనట్స్ బహుమతిగా ఇచ్చారని, ఆ ఫొటోలను షేర్ చేశారు.

‘ఈ డోనట్స్ అందించిన స్వీటెస్ట్ విద్యా బాలన్ మ్యామ్‌కు థ్యాంక్స్” అంటూ తన పోస్టులో రాశీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రాశీ ఖన్నా నటించిన ‘లుక్కే’ అనే వెబ్ సిరీస్ మే 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. 8 ఎపిసోడ్ల ఈ మ్యూజికల్ యాక్షన్ డ్రామా సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. వీటితో పాటు షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిలతో కలిసి ‘ఫర్జీ’ సీజన్ 2లో, విక్రాంత్ మాస్సేతో ‘తలాఖో మే ఏక్’, ఆర్. మాధవన్‌తో ‘బ్రిడ్జ్’ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు కూడా రాశీ చేతిలో ఉన్నాయి..!!

21 YEARS FOR Amma Nanna O Tamila Ammayi!

Ananya Nagalla Breaks Silence on Instagram Subscription Row