
సాధారణంగా ఒకే సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటేనే ఆ సందడి వేరుగా ఉంటుంది. కానీ ‘రాకా’ చిత్రంలో ఏకంగా నలుగురు అగ్ర హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ భామలు ఈ చిత్రంలో పాలుపంచుకుంటున్నారు. రష్మిక మందన్నతో అల్లు అర్జున్ కెమిస్ట్రీ ఇప్పటికే ‘పుష్ప’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ జతకట్టడం ఒక ఎత్తయితే, తొలిసారిగా దీపికా, మృణాల్, జాన్వీలు బన్నీతో కలిసి నటిస్తుండటం సినిమాకు సరికొత్త గ్లామర్ హంగులను అద్దింది..
వీరి పాత్రలు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథలో చాలా కీలకమైన మలుపులకు కారణమవుతాయని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. అట్లీ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో, రిచ్ విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ తన రెండు పాత్రల వేరియేషన్స్‌తో అదరగొడుతుంటే, ఈ నలుగురు ముద్దుగుమ్మలు తమ అందచందాలతో సినిమాకు అసలైన రంగును అద్దబోతున్నారు..!!

