
విజయ్‌కు, హీరోయిన్ త్రిష కృష్ణన్ కు మధ్య ప్రేమాయణం ఉందని చాలా ఏళ్లుగా గాసిప్స్ నడుస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడంతో..ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్లపై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అయినా సరే, నెటిజన్లు మాత్రం ఈ విషయం వదిలిపెట్టడం లేదు ఇక మరోవైపు, విజయ్ వ్యక్తిగత జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన భార్య..విజయ్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉండటం వల్ల విరాకుల కోరుతున్నాను అంటూ స్టేట్మెంట్ విడుదల చేయటం..
ఈ రూమర్లకు మరింత ఊపొచ్చింది. దీంతో చాలామంది విజయ్..త్రిష లవ్ స్టోరీ నిజమే అంటూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇవన్నీ ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాని విషయాలే. ఈ క్రమంలో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు TVK (Tamilaga Vettri Kazhagam) కూడా ఈ గాసిప్స్‌కు కొత్త మలుపు ఇచ్చింది. త్రిష పూర్తి పేరు త్రిష కృష్ణన్. నెటిజన్లు ఇప్పుడు దీనిని విజయ్ పేరుతో కలిపి, “Trisha – Vijay – Krishnan అంటే TVK” అంటూ ట్విట్టర్లో పోస్టులు వైరల్ చేస్తున్నారు. చూశారా పార్టీ పేరులో కూడా త్రిష పేరు ఉంది..అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు దీనిని జోక్‌గా తీసుకుంటే, మరికొందరు మాత్రం ఇది చాలా ఓవర్ థింకింగ్ అంటూ మండిపడుతున్నారు..!!
