
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‍లో వస్తున్న భారీ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‍లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించినట్లు, ఆమెకు ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‍గా మారింది.
ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ‘ సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్‍కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాట విజయంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో అల్లు అర్జున్, అట్లీలు తమ సినిమాకు పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ అయితే కచ్చితంగా ప్లస్ అవుతుందని భావించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమా విజయంలో ఈ పాట కీలకమవుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది..!!
