in

cute beauty Ashika Ranganath flooded with telugu offers!

మిగోస్’ సినిమాతో ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పాలరాతి శిల్పం లాంటి ఈ బ్యూటీని చూసిన మరుక్షణమే కుర్రాళ్లంతా ఆమె అభిమానులుగా మారిపోయారు. అందానికి నిర్వచనం ఆమెనే అని ఫిక్స్ అయ్యారు. ‘నా సామిరంగ’ సినిమాతో ఆమెకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. ‘విశ్వంభర’లో ఆమె పాత్ర ఎలా ఉండనుందా? ఆమె ఎలా కనిపించనుందా? అనే ఒక కుతూహలంతో వెయిట్ చేస్తున్నారు..

ఈ నేపథ్యంలోనే ఆమె రవితేజ సరసన మెరవనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. రవితేజ – కిశోర్ తిరుమల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం ఉందట. అందువలన ఆషికా రంగనాథ్..కేతిక శర్మలను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ‘అనార్కలి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాతో మరో పెద్ద ప్రాజెక్టు ఆషికా ఖాతాలో చేరిపోయినట్టే అనుకోవాలి మరి..!!

Rakul Preet clarifies that her Hyderabad house is not gifted!