రష్మిక మందన తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో శారీలో ఉన్న పిక్స్ మరింత వైరల్ కావడంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆ ఫోటోలు తీసింది.. మరెవరో కాదు.. బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ. ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి. ఈ రంగు, ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ..
అంతేకాకుండా ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలోని ప్రతిదీ నా లైఫ్‌లో భర్తీ చేయలేనివీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే ఈ ఫోటోల్లో ఉన్న బ్యాగ్ గ్రౌండ్ విజయ్ దేవరకొండ ఇంటిలాగే ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలు కచ్చితంగా విజయ్ దేవరకొండ తీసి ఉంటారని మరొకరు రాసుకొచ్చారు. గతంలో కూడా ఇలాగే చాలాసార్లు విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలు షేర్ చేసి దొరికిపోయిన రష్మిక, మరోసారి అలాగే నెటిజన్లకు చిక్కింది..!!