in

kl rahul’s wife actress Athiya Shetty quits movies!

తియా శెట్టి..భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ భార్య. రాహుల్ ను పెళ్లి చేసుకోక ముందు బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. అయితే ఆమె అనుకున్న సక్సెస్ ను అందుకోలేకపోయింది. తండ్రి సునీల్ శెట్టి చరిష్మా ఆమెకు ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. అయితే ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సునీల్ శెట్టి ధృవీకరించారు..

తన కుమార్తె అతియా శెట్టి బాలీవుడ్ నుంచి తప్పుకుని, నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సునీల్ శెట్టి ఇటీవల వెల్లడించారు. అతియా ఇకపై సినిమాల్లో కెరీర్‌ను కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. నాన్నా..నాకు నటించడం ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోయింది. మోతీచూర్ చక్నాచూర్ సినిమా తర్వాత, ఆమె చాలా మందిని ఆకర్షించింది. కానీ తనకు నటించడం ఇష్టం లేదని చెప్పిందన్నారు సునీల్ శెట్టి. 2015లో సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించిన ‘హీరో’ సినిమాతో అరంగేట్రం చేసింది అతియా..!!

vijay devarakonda mystery photographer for rashmika!

Rashmika reveals she didn’t want to be an actress!