బేబీ బంప్ తో సమంత..వైరల్ అవుతున్న పిక్స్!
తాజాగా సమంతకు సంబంధించి ప్రెగ్నెన్సీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. నాగాచైతన్యతో విడాకుల తర్వాత తనకు మాతృత్వాన్ని అనుభవించాలన్న కోరిక ఉందంటూ అప్పట్లో సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కూడా తెలిసిందే. బేబీ బంప్ ఫోటోలతో చూసిన వారంతా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) టెక్నాలజీ తో సమంత ప్రెగ్నెంట్ పిక్స్
అయితే సమంత బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే సమంత ప్రెగ్నెంట్ కాదు. ఇవి ఎవరో కావాలని చేసిన పని. ఏఏఐని ఉపయోగించి సమంత ప్రెగ్నెంట్ అంటూ ఫొటోలు క్రియేట్ చేశారు. ఇదేం కొత్త కాదు. గతంలో కూడా సమంత ప్రెగ్నెంట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు సమంత బేబీ బంప్ ఫొటోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టుచేశారు..!!