ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైమ్ ఇప్పుడు చెబుతున్నాను. నాకు సుకుమార్ ‘ ‘పుష్ప’ సినిమా కథ చెప్పగానే..నేను ఆయన్ని ఒక్కటే అడిగాను. ‘సినిమా హిట్ అవ్వాలని కూడా నేను కోరుకోవడం లేదు. నాకు మాత్రం ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావాలి. ఇది నువ్వు అనుకుంటేనే సాధ్యపడుతుంది. నేను ఒక్కడిని అనుకుంటే రాదు’ అని సుకుమార్‌ను కోరుకున్నాను. వెంటనే సుకుమార్ ‘ నీకు నేషనల్ అవార్డు రావడానికి నా శాయశక్తులా కృషిచేస్తాను’ అన్నారు. అంతేకాదు, సినిమా షూటింగ్లో నా మీద తీసే ప్రతి సన్నివేశాన్ని ఆయన సంతృప్తి పడే వరకు మళ్లీ రీటేక్‌లు చేసేవాడు.
‘డార్లింగ్ నేషనల్ అవార్డు రావాలంటే ఈ రేంజ్ సరిపోదు మళ్లీ చేద్దాం’ అనే వాడు. ప్రతి షాట్ టేక్కు మా మధ్య నేషనల్ అవార్డ్ డిస్కషనే ఉండేది. ఇలా నేషనల్ అవార్డు కొట్టాలని మనసులో ముందే వుండేది. అవార్డు కొట్టిన తరువాత ఇప్పుడు చెబుతున్నా..నా పేరు అర్జున్.. గురిపెట్టి నేషనల్ అవార్డు కొట్టాను. నాకు అది తప్ప ఆ సమయంలో ఏమీ కనిపించలేదు. సో.. నాకు ఇంత విలువైన ఈ అవార్డును మన తెలుగు హీరోలందరికి అంకితం చేస్తున్నాను” అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.