in

Mrunal Thakur gets a crazy offer from kollywood!

యాక్షన్ ఎంటర్ టైనర్స్, కమర్షియల్ సినిమాలు చేసే సూర్య మధ్యలో ‘ఆకాశమే నీ హద్దు’ ‘జై భీం’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసాడు. ఇపుడు కంగువాతో విభిన్నంగా వస్తున్నాడు. నెక్స్ట్ ఆర్జె  బాలాజీతో చేయబోయే సినిమా ఆధ్యాత్మిక జోనర్ లో ఉంటుందని, ఒక డివోషనల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ అని టాక్. ప్రజంట్ డివోషనల్ మూవీస్ కి ఆదరణ పెరగటంతో మార్కెట్ కూడా పెరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకుని సూర్య ఈ మూవీకి కమిట్ అయినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో సూర్య సరసన నటించే హీరోయిన్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికి ఒక హీరోయిన్ గా సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయినట్లు సమాచారం..!!

can you guess how many times these heroes died in movies!

akkineni Akhil signs 2 new projects at a time!