రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి వరుస పరాజయాల తర్వాత పూజాకు ఆశించిన స్థాయిలో విజయాలను వరించలేవని చెప్పాలి. దీంతో ప్రస్తుతం మళ్లీ కమ్ బ్యాక్ కోసం తీవ్రంగా కృషి చేస్తోందీ చిన్నది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం గమనార్హం. తమిళంలో రెండు చిత్రాలు హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది. వీటిలో తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పడం ఖాయమని పూజా భావిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా పూజా రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న ఈ చిన్నది తాజాగా రెమ్యునరేషన్‌ను తగ్గించినట్లు తెలుస్తోంది. అవకాశాలు తగ్గడంతోనే పూజా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ సినిమాకు పూజా రెమ్యునరేషన్ తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తమిళంలో సూర్య 44 చిత్రంలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసిందీ బ్యూటీ. ఈ సినిమా కూడా తనకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావంతో ఉంది..!!