in

Balakrishna as Krishna in his son Mokshagna’s debut movie?

నంద‌మూరి న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ కోసం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ క‌థ‌ని సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాల‌కృష్ణ అతిథి పాత్ర‌లో క‌నిపిస్తార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న ఇందులో కృష్ణుడిగా ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ‘హ‌నుమాన్‌’ సోష‌ల్ క‌థే అయినా, చివ‌ర్లో మైథ‌లాజిక‌ల్ ట‌చ్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌..

స‌రిగ్గా అదే ఫార్ములా ఈ సినిమాలోనూ పాటించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ క‌థ‌లో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని, చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని తెలుస్తోంది. దాదాపుగా స్క్రిప్టు సిద్ధ‌మైపోయింద‌ని, బాల‌య్య‌కు ఓ ఫైన‌ల్ నేరేష‌న్ ఇస్తే, అంతా సెట్ అయిపోతుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ కూడా రాబోతోంది..!!

nivetha thomas undergoing a huge physical transformation!

31 years for MR.PELLAM!