మహేష్ బాబాయికి 49 ఏళ్లు!
కొందరు హీరోస్ ఏజ్ తక్కువ కనిపించడానికి గంటలు గంటలు మేకప్..లేదా ‘డి ఏజింగ్’ లాంటి టెక్నీక్స్ ను ఫాలో అవుతుంటారు..కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం..’ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ ఫర్ మీ’ అన్నట్లుగా ఉంటారు..మొన్న ఆగష్టు 9th న ఆయన 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49వ ఏట అడుగు పెట్టాడు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీ తో ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు మహేష్..ఎయిర్ పోర్ట్ లో తీసిన వీడియోలో మహేష్ సరికొత్త గెటప్ లో కనిపించారు. అది కూడా ‘పోనీ టైల్’ లో..ఇన్నేళ్ల నుండి మహేష్ ను జుట్టు లో ఎప్పుడు సరిగ్గా చూడలేదు..
ఎస్ఎస్ రాజమౌళితో రాబోయే చిత్రం ‘SSMB49’
ఎప్పుడు స్మాల్ హెయిర్ కట్ ఇంక గడ్డం లైట్ గ పెట్టుకొని నార్మల్ లుక్స్ మైంటైన్ చేస్తుంటాడు..కానీ ఈసారి, SS రాజమౌళి దర్శకత్వం వహించే తన సినిమా ‘SSMB29‘ కోసం అతను కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి..జైపూర్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ పోనీ టైల్ లుక్ చూసి అందరు షాక్ అయ్యారు..గడ్డం కూడా బాగానే ఒత్తుగా కనిపిస్తుంది..రాజమౌళి హీరో అంటేనే క్యారెక్టర్ ఎలివేషన్ మాములుగా ఉండదు..మరి మహేష్ ఈ సినిమా కోసం ఇంక ఎన్ని చేంజెస్ చేసి స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తారో చూడాలి..ప్రెసెంట్ ఈ పిక్స్ ఇంక వీడియో సోషల్ మీడియాలో ట్రేండింగ్ గ ఉంది..లైకులు, షేర్ లు చేస్తూ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు..!!
#MaheshBabu and family at Jaipur Airport. pic.twitter.com/RPI6Rh6D1J
— Gulte (@GulteOfficial) August 11, 2024