in

dusky beauty pooja hegde in tillu cube?

రుస పరాజయాలతో ఈ భామ కెరీర్‌ సాగుతున్నది. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌నిచ్చి కుటుంబ సభ్యులతో విరామ సమయాల్ని గడుపుతున్నది. తాజా సమాచారం ప్రకారం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడు ఓ గుడ్‌న్యూస్‌ను అందుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..టిల్లు, టిల్లు స్వేర్‌ చిత్రాలు యువతరంలో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. టిల్లు పాత్రలో హీరో సిద్ధు జొన్నలగడ్డ తనదైన మేనరిజమ్స్‌, హైదరాబాదీ కామెడీతో ఆకట్టుకున్నారు.

ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు తెలిసింది. డీజే టిల్లు, టిల్లు స్వేర్‌ చిత్రాల్లో కథానాయిక పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో భాగంలో పూజహెగ్డేను కథానాయికగా తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి..!!

homely beauty Keerthy Suresh lip lock with Varun Dhawan?

telugu actress Kamakshi Bhaskarla About Bold Scenes!