in

PATHOS RAAGA SIVARANJANI FOR DUET???

సై జ్ఞానీ (సంగీత జ్ఞానీ) ఇళయ రాజా, తన ప్రతిభ తో ఎదిగిన సంగీత దర్శకుడు, ఎక్కడో మారుమూల గ్రామం నుంచి, హార్మోనియం భుజానికి తగిలించుకొని అప్పటి మద్రాసు పట్టణం చేరుకొని, ఎన్నో ఆకలి అనుభవాలు, నిద్ర లేని రాత్రుల నుంచి ఎదిగిన కర్మ జీవి. వామ పక్ష భావజాల వేదికల నుంచి తన సంగీత ప్రస్థానం ప్రారంభించి, తనని, తాను మలుచుకుంటూ సంగీత జ్ఞానీ గ ఎదిగిన తీరు ప్రశంసనీయం. భుక్తి కోసం మద్రాసు మీరిన బీచ్ లో హార్మోనియం వాయించిన డేనియల్ రాజా, లండన్ లో మ్యూజిక్ సింఫనీ చేసే స్థాయికి ఎదిగారు. ఎవరు ఎన్ని పాటలు చేసిన స్వరాలూ ఏడే, కానీ ఆ స్వరాల గమన క్రమం, రాగాలు అవుతాయి, ఒక్కో సందర్భం లో ఒక్కో రాగాన్ని వాడటం పరిపాటి, విషాదానికి కొన్ని రాగాలు, సంతోషానికి కొన్ని రాగాలు, భీభత్సానికి కొన్ని రాగాలు వాడటం పరిపాటి. కానీ ఇళయ రాజా విషాదానికి విశేషంగా వాడే” శివరంజని” రాగం తో ఒక సూపర్ డూపర్ హిట్, డ్యూయెట్ సాంగ్ కి మ్యూజిక్ అందించి అందరిని ఆశ్చర్య పరిచారు.

ఆ పాట ఏదో మీకు తెలుసా? పాట మీ అందరి నోళ్ళలో నానిన పాటే, కానీ అది శివరంజని రాగం అని చాలా మంది కి తెలియదు. చిరంజీవి గారు, శ్రీ దేవి గారు నటించిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” చిత్రంలోని, ” అబ్భా నీ తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉందిరో అబ్బా” అనే పాట, శివరంజని రాగంలో కంపోజ్ చేసిందే, ఇళయ రాజాకు ముందు కూడా చాల మంది సంగీత దర్శకులు చాల ప్రయోగాలు చేసారు. వారి బాటలోనే తన ప్రతిభను చాటుకోవడానికి ఇళయ రాజా చేసిన ఒక ప్రయత్నమే ఈ పాట. ఇటువంటి ఛాలెంజెస్ చేసి ప్రూవ్ చేసుకున్నారు కాబట్టే ఆయన ఇసై జ్ఞానీ అయ్యారు. శివ రంజని రాగం అంటే మన దాసరి నారాయణ రావు గారికి కూడా చాల ఇష్టం, అయన ఆ రాగం టైటిల్ తో ఒక సినిమా కూడా నిర్మించారు, ఆయన సినిమాలలో శివరంజని రాగం లో ఎన్నో పాటలు కూడా సంగీత దర్శకులతో చేయించుకున్నారు..!!

Jr NTR all set to host a new show for a OTT platform?

Boney Kapoor ‘won’t allow’ for Sridevi biopic!