in

janhvi kapoor signs her 3rd in telugu?

దేవర’లో జూనియర్ ఎన్టీయార్ సరసన నటిస్తోంది జాన్వీ. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూటింగ్ జరుగుతోంది.  ఇంకోపక్క, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా కమిట్ అయ్యింది జాన్వీ కపూర్. ఇటీవలే జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ధృవీకరించిన సంగతి తెలిసిందే.

కాగా, జాన్వీ కపూర్ మరో ప్రాజెక్ట్‌కి చూచాయిగా ఆమోదం తెలిపిందని అంటున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడట. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన ఆ యంగ్ హీరో, బ్యాక్ టు బ్యాక్ పెయిల్యూర్ సినిమాలే చేశాడు ఇప్పటిదాకా. ఓ ప్రాజెక్ట్ మాత్రం మమ అన్పించింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఆ హీరో కొత్త సినిమా వుండబోతోందట..!!

‘Drishyam’ goes worldwide set for Hollywood remake!

Naga Babu says sorry For His comments On Policemen Height!